మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలు కొనసాగించారని కొనియాడారు.
'కరోనా ఆర్థిక సంక్షోభంలోనూ.. తెలంగాణలో సంక్షేమ ఫలాలు'
కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ సర్కార్ పథకాలు కొనసాగించిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో 12 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిమెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిమెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిమెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు చేయూతగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు చేపట్టారని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథకం కింద మొదట రూ.50వేల అందజేయగా.. ప్రస్తుతం రూ.1,00,016 ఇస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సవరణ చట్టం.. రైతులు, పేదలకు వరంగా మారనున్నట్లు వెల్లడించారు. చట్ట సవరణతో భూవివాదాలు ఉండవని, రైతుల భూములకు అధికారులు హద్దులు చూపి భద్రతా హక్కులు కల్పిస్తారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.
- ఇదీ చూడండిదుర్గం చెరువు బ్రిడ్జిపై సింఫోని బ్యాండ్