రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆడపిల్లల వివాహం అంటే బాధపడే తల్లిదండ్రులకు కాస్త ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకురావడం జరిగిందని ఆయన చెప్పారు.
కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి - మెదక్ జిల్లా నర్సాపూర్ తాజా వార్త
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆడపిల్లల వివాహం అంటే భారమనుకునే తల్లిదండ్రులకు కొంత ఆర్థిక సాయం అందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశానికి మదన్‌రెడ్డి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణారెడ్డి, కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ మురళీయాదవ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'