వైకల్యం అనేది శరీరానికే కాని హృదయానికి కాదని.. ప్రతి ఒక్కరిలో ఎదో ఒక లోపం ఉంటుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మనోధైర్యంతో ఆ లోపాన్ని అధిగమించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. కల్లెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
సదరన్ క్యాంపులు ఈ నెలలో..
కరోనా కారణంగా ఆగిపోయిన సదరన్ క్యాంపులు ఈ నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అర్హులైన దివ్యాంగులందరికీ సర్టిఫికేట్లు అందజేస్తాం. జిల్లాలో 8,957 మందికి ఆసరా పింఛన్లు, 218 మహిళా సమాఖ్య బృందాలకు బ్యాంకు రుణాలు అందిస్తున్నాం. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి.
-డీఆర్డీఓ శ్రీనివాస్