అధికారం చేతిలో ఉన్నా వ్యవసాయం మీద మక్కువ తగ్గలేదు ఆ అధికారికి. తనకున్న పోలంలో ప్రయోగాత్మకంగా పంటలు పండించి ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ సుభాష్‌రెడ్డికి మెదక్‌లో వ్యవసాయక్షేత్రం ఉంది. ప్రాచీన పద్దతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అర్జిస్తున్నారు. వరి, చెరకు పంటలకు ప్రత్యామ్నయంగా బంగాళదుంప, గుమ్మడి సాగు చేసి రూ.80 వేలు లాభాన్ని పొందారు.
మెదక్ జిల్లాలో మొదటిసారిగా బంగాళదుంప పండడంపై కలెక్టర్ ధర్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగాలు చేసి లాభాలు ఆర్జించిన ఖనిజశాఖ ఛైర్మన్‌ను అభినందించారు. రైతులందరూ ఈ పద్ధతులను అనుసరించాలని కోరారు. సమీకృత వ్యవసాయ విధానం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా నష్టం తక్కువగా ఉంటుందని రైతులకు వివరిచారు. ఒకే రకమైన పంటలు వేస్తే గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడతారని వాటికి అనుబంధ పంటలు ద్వారా నష్టాన్ని భర్తీచేయవచ్చని పేర్కొన్నారు.