నల్లవాగు ప్రాజెక్టు నుంచి వృథాగా పోయే నీటిని నిలువరించేందుకు చెక్‌డ్యాంలు నిర్మించనున్నట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. కల్హేర్ మహారాజు వాగు పరిధిలో చెక్‌డ్యాంల నిర్మాణానికి స్థలాలను నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఏడాది నల్లవాగు పూర్తిస్థాయిలో నిండి రెండు టీఎంసీల నీరు వృథాగా దిగువకు వెళుతుందన్నారు.
కల్హేర్‌లో చెక్‌డ్యాంల నిర్మాణానికి స్థలాల పరిశీలన - inspection-of-places-for-construction-of-checkdams-in-kalheri
మెదక్ జిల్లా కల్హేర్ మహారాజు వాగు పరిధిలో చెక్‌డ్యాంల నిర్మాణానికి స్థలాలను నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరిశీలించారు. ప్రతి ఏడాది నల్లవాగు పూర్తిస్థాయిలో నిండి రెండు టీఎంసీల నీరు వృథాగా దిగువకు వెళుతుందన్నారు. పోచాపూర్ శివారులో రూ. 2.10 కోట్లతో నిర్మించే చెక్‌డ్యాంలో మూడు మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు నిలిచే అవకాశం ఉంటుందని వివరించారు.
ప్రాజెక్టు నుంచి జిల్లా సరిహద్దు వరకు 20 కిలోమీటర్ల మేర వాగు పారుతోందని, మొదటి విడతలో కల్హేర్ శివారులో రూ.1.67 కోట్లతో నిర్మించే చెక్‌డ్యాం వల్ల నాలుగు మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. బీబీపేట శివారులో రూ.1.58 కోట్లతో నిర్మించే చెక్‌డ్యాంలో 3.5 మిలియన్ క్యూబిక్ అడుగులు, పోచాపూర్ శివారులో రూ. 2.10 కోట్లతో నిర్మించే చెక్‌డ్యాంలో మూడు మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు నిలిచే అవకాశం ఉంటుందని వివరించారు. చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే భూగర్భజలాలు వృద్ధి చెందడంతో పాటు అదనపు ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు.
ఇదీ చూడండి:స్వస్థలాల బాటలో వలసజీవులు