తెలంగాణ

telangana

ETV Bharat / state

రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ఇగ్నైట్‌ ఫెస్ట్ - ఎమ్మెల్యే మదన్ రెడ్డి లేటెస్ట న్యూస్

నర్సాపూర్‌ సమీపంలోని గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల సంయుక్తంగా రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ఇగ్నైట్‌ ఫెస్ట్ జరిపారు. యూత్‌ పార్లమెంట్, వ్యాసరచన, స్పెల్‌బీ, సైన్స్‌ఫేర్‌, క్విజ్‌, డ్యాన్స్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ignite fest at reddypalli in medak district
రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ఇగ్నైట్‌ ఫెస్ట్

By

Published : Dec 19, 2020, 12:15 PM IST

చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్‌ సమీపంలోని గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల సంయుక్తంగా రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ఇగ్నైట్‌ ఫెస్ట్ జరిపిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. విద్యార్ధులు బాగా చదివి తల్లిదండ్రులు కళలను నిజం చేయాలని కోరారు. యూత్‌ పార్లమెంటు, వ్యాసరచన, స్పెల్‌బీ, సైన్స్‌ఫేర్‌, క్విజ్‌, డ్యాన్స్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

సైన్స్‌ఫేర్‌లో సంప్రదాయ ఇంధన వనరు, సోలార్‌ విద్యుత్, ఎలక్ట్రో మాగ్నెట్‌, పరిశ్రమలు, పర్యావరణ పరిరక్షణ, పట్టణ ట్రాఫిక్‌ నియంత్రణ వంటి నమూనా ప్రదర్శనలు విద్యార్థులు తయారు చేశారు. పలువురు విద్యార్థులు తమ సత్తాను చాటి బహుమతులు గెలుచుకున్నారు.

ఈ కార్యక్రమంలో గురుకులాల జాయింట్‌ సెక్రటరి విజయలక్ష్మీ, ఒఎస్డీ కోటేశ్వర్‌ రావు, ప్రిన్సిపల్‌ భిక్షమయ్య, చార్లెస్‌, మమత, మాధవి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:విమానాల్లో వస్తుంది.. చోరీ చేసి వెళ్తుంది..

ABOUT THE AUTHOR

...view details