EDUPAYALA TEMPLE: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో రెండవ రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు బుధవారం రోజు కావడంతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.
భక్తులు మంజీరా నది పాయలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పుల దరువు , జయజయ ధ్వానాల మధ్య బండ్ల ఊరేగింపు కన్నుల పండగగా సాగనుంది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ఏడుపాయలకు బయలు దేరింది.