తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులకు సహాయ కేంద్రాలు - తెలంగాణ వార్తలు

కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పిల్లల కోసం సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ అధికారి జయరాం నాయక్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల సహాయ కేంద్రం పని చేస్తుందని చెప్పారు. 

మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ జిల్లా అధికారి జయరాం నాయక్
మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ జిల్లా అధికారి జయరాం నాయక్

By

Published : May 13, 2021, 4:20 PM IST

మెదక్​ జిల్లాలో కరోనా బారినపడి.. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పిల్లల కోసం సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ జిల్లా అధికారి జయరాం నాయక్ చెప్పారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల సహాయ కేంద్రం పని చేస్తుందని తెలిపారు.

సహాయానికై 040-23733665 నెంబర్​కు ఫోన్ చేయవచ్చని అన్నారు. ఆపదలో ఉండి సంరక్షణ అవసరమైన పిల్లలకు 24 గంటలు పనిచేసే ఉచిత టోల్ ఫ్రీ చైల్డ్ లైన్ నెంబరు 1098కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు, వృద్ధులు కరోనా టీకా పొందడానికి సహాయం చేయుటకై ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసిందన్నారు.

వృద్ధులైతే 14567 నెంబరుకు, దివ్యాంగులైతే 18005728980 టోల్ ఫ్రీ నెంబర్​కు ఫోన్​చేయాలన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫోన్ చేయవచ్చని చెప్పారు.

ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న గర్భిణీ వైద్యురాలి 'చివరి సందేశం'

ABOUT THE AUTHOR

...view details