మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయిపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్‌లోకి పూర్తిగా వరద నీరు వచ్చింది. ఈ క్రమంలో రెండు వాహనాలు అందులో చిక్కుకున్నాయి. దీంతో హైదరాబాద్ నాగపూర్ ఎన్‌హెచ్44 జాతీయ రహదారిపై తెల్లవారుజాము నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా రహదారి ఇరువైపులా 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. హైవే సిబ్బంది 8భారీ మోటార్లతో నీటిని బయటకు పంపివేస్తున్నారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది, ప్రత్యామ్నాయ మార్గాల గుండా వాహనాలను మళ్లిస్తున్నారు.
రైల్వే అండర్‌పాస్‌లోకి చేరిన వరద నీరు.. హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ - రైల్వే అండర్‌పాస్ తాజా వార్తలు
మెదక్ జిల్లాలోని రైల్వే అండర్ పాస్‌లోకి పూర్తిగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అక్కడికి చేరుకొని నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపివేస్తున్నారు.
రైల్వే అండర్ పాస్