మెదక్ సీఎస్ఐ చర్చికి భక్తులు, సందర్శకులు పోటెత్తారు. ఉదయం నుంచి మతగురువు దయానంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం కావటం వల్ల రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా... ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రార్థనలు చేశారు. సిలువ ముందు కొబ్బరికాయలు కొట్టి, కొవ్వత్తులు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చర్చికి వచ్చే భక్తులు, సందర్శుకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మతగురువు తెలిపారు.
మెదక్ సీఎస్ఐ చర్చికి పోటెత్తిన భక్తులు - heavy rush in medak csi church
మెదక్ చర్చికి భక్తులు, సందర్శకులు పోటెత్తారు. మతగురువు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

మెదక్ సీఎస్ఐ చర్చికి పోటెత్తిన భక్తులు
మెదక్ సీఎస్ఐ చర్చికి పోటెత్తిన భక్తులు