తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షాలు... కోతకొచ్చిన పంట నీటిపాలు - Medak rains news

మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట నేలపాలైంది. పెట్టిన పెట్టుబడి కూడ రాక అన్నదాత కన్నీటిపర్యంతమవుతున్నాడు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

భారీ వర్షాలు... కోతకొచ్చిన పంట నీటిపాలు
భారీ వర్షాలు... కోతకొచ్చిన పంట నీటిపాలు

By

Published : Oct 14, 2020, 4:20 PM IST

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కోతకొచ్చిన వరి పంట నీట మునిగింది. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వరి పైరు నేలకొరిగింది. పంట చేతికందే సమయంలో దెబ్బతినడం వల్ల అన్నదాతకు పెట్టుబడి కూడా రాక కన్నీటిపర్యంతమవుతున్నాడు.

మెదక్ జిల్లాలో లక్షా 90 వేల ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం నాయక్ అన్నారు. పత్తి 80 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 33 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.

నష్టానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో సర్వే నెంబర్ల వారిగా జాబితాను తయారుచేసి పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు.

ఇవీచూడండి:ఎల్బీనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details