తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈదురుగాలులతో కూడిన వర్షం.. విద్యుత్​కు అంతరాయం - Medak District News

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి.

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
ఈదురుగాలులతో కూడిన వర్షం.

By

Published : Jun 11, 2021, 9:50 AM IST

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి

నారాయణఖేడ్​లో 11 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం కురిసింది. పట్టణ శివారులోని మన్సూర్ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కంగ్టి, సిర్గాపూర్​కు రాకపోకలు నిలిచిపోయాయి. నర్సాపూర్, బెజ్జంకిలోనూ భారీ వర్షం పడింది.

ఇదీ చదవండి:Covid-19: నాలుగో రోజూ లక్ష దిగువన కేసులు

ABOUT THE AUTHOR

...view details