RAIN: తూప్రాన్‌లో భారీ వర్షం... జలమయమైన కాలనీలు - telangana varthalu
09:33 July 15
RAIN: తూప్రాన్‌లో భారీ వర్షం... జలమయమైన కాలనీలు
మెదక్ జిల్లా తూప్రాన్‌లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పట్టణంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. ఉదయం మున్సిపాలిటీ అధికారులు జేసీబీల సహాయంతో కాలనీల్లో నిలిచిన వర్షపు నీరు మురికి కాలువలకు చేరేలా చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడ రోడ్లపై నీరు నిలవడం వల్ల పట్టణవాసులు ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. భారీగా నీరు చేరడంతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి.
ఇదీ చదవండి: RAINS: రాజధానిలో కుంభవృష్టి.. నీటమునిగిన కాలనీలు