వాయుగుండం ప్రభావంతో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భారీ వర్షం కురిసింది.పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్, కమిషనర్ రమణమూర్తి కాలనీల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
నర్సాపూర్‌లో పలు కాలనీలు జలమయం.. - మెదక్ జిల్లాలో వర్షాలు
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. నర్సాపూర్-హైదరాబాద్ రహదారి పక్కన కూలీలకు ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలు నీట మునిగాయి.
నర్సాపూర్‌లో పొంగిపొర్లుతున్న రాయరావు చెరువు... ఇళ్లు జలమయం
జాతీయ రహదారి నిర్మాణంలో పనిచేసే కూలీలకు నర్సాపూర్-హైదరాబాద్ రహదారి పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోని సామాగ్రి అంతా నీటిపాలయ్యింది. స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రహదారి నిర్మాణ గుత్తేదార్లు చెప్పారు.
ఇదీ చదవండి:లాలాపేటలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నాలా