ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రవహించే మంజీరా నదిలో భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని పులకుర్తి వంతెన వద్ద నది నిండుకుండను తలపిస్తోంది. సంగారెడ్డి జిల్లాతో పాటు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు నదికి వరద నీరు వస్తోంది.
మంజీరా నదిలోకి భారీగా చేరుతున్న వరద నీరు - మంజీరా నది
ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 96 కిలో మీటర్లు ప్రవహించే మంజీరా నది నిండుకుండను తలపిస్తోంది. సంగారెడ్డి జిల్లాతో పాటు నది ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురవడం వల్ల నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
![మంజీరా నదిలోకి భారీగా చేరుతున్న వరద నీరు Heavy flood water in the Manjira River in medak district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8228919-248-8228919-1596095689243.jpg)
మంజీరా నదిలోకి భారీగా చేరుతున్న వరద నీరు
మంజీరా నది సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని జనవాడ వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 96 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. గడిచిన మూడేళ్లుగా నీరు లేక ఎండిపోయి బోసిపోయిన మంజీరా నది.. ఈ ఏడాది భారీగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
ఇవీ చూడండి: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష