తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2019, 10:33 PM IST

ETV Bharat / state

మెదక్​ మున్సిపల్​ ఎన్నికలపై హైకోర్టు స్టే

మెదక్​ మెదటి వార్డులోని ఆర్టీసీ కాలనీని 30వ వార్డులో కలపటాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం సానుకులంగా స్పందించింది. మున్సిపల్​ ఎన్నికలపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది.

hc-stays-on-medak-municipal-election

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న తరుణంలో మెదక్ పురఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజన సరిగా చేపట్టలేదని... మొదటి వార్డులోని ఆర్టీసీ కాలనీ వాసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వార్డుల పునర్విభజన మరోసారి నిర్వహించాలని అధికారులను స్థానికులు కోరినా... లెక్కచేయకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మెదక్​లో ఇదివరకు 27 వార్డులు ఉండగా... మున్సిపాలిటీలోని అవుసులపల్లి, ఔరంగాబాద్​, పిల్లికొట్టాల్ గ్రామాలు విలీనం కావటం వల్ల వార్డుల సంఖ్య 32కు చేరింది. ఒకటో వార్డు పరిధిలోని ఆర్టీసీకాలనీని విభజించి మూడు కిలోమీటర్ల దూరంలోని 30వ వార్డులో చేర్చటం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతోనే హైకోర్టును ఆశ్రయించినట్లు స్థానికులు తెలిపారు.

మెదక్​ మున్సిపల్​ ఎన్నికలపై హైకోర్టు స్టే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details