తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్ జిల్లాలో పోలీసుల హరితహారం - పోలీసుల

మెదక్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న పోలీసు పరేడ్ గ్రౌండ్​లో హరితహారంలో భాగంగా డీఎస్పీ కృష్ణమూర్తి మొక్కలు నాటారు.

మెదక్ జిల్లాలో పోలీసుల హరితహారం

By

Published : Aug 10, 2019, 10:26 AM IST

మెదక్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్​ పరేడ్​గ్రౌండ్​లో హరితహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణమూర్తి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రకృతి రక్షణకై ప్రతి పౌరుడు పాటుపడలన్నారు. ఇప్పుడు నాటిన మొక్కలే రేపటి భావితరాలకు చెట్లు, రాబోయే కాలంలో ప్రకృతి రక్షణకు ఎంతో దోహదపాడుతాయన్నారు.

చెట్లు నాటడం ఒక పనిగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను కాపాడాలని, వాటిని మనం కాపాడితే మనకు జీవితాంతం ప్రాణవాయువును అందిస్తాయన్నారు. ఇక్కడ 1500 వరకు మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ సీఐ వెంకట్, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు లింబాద్రి, శ్రీకాంత్, పెంటయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మెదక్ జిల్లాలో పోలీసుల హరితహారం

ఇదీ చూడండి : నాన్న కాదు...నరరూప రాక్షసుడు

ABOUT THE AUTHOR

...view details