తెలంగాణ

telangana

ETV Bharat / state

చండీయాగం నిర్వహణకు సకలం సన్నద్ధం - కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చండీయాగం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొండపోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పరిసరాల్లో నిర్మిస్తున్న యాగశాలను చూసి పలు సూచనలు చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Harishrao visited Kondapochamma temple
చండీయాగం నిర్వహణకు సకలం సన్నద్ధం

By

Published : May 28, 2020, 12:20 PM IST

కరవుసీమలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండో అతి పెద్ద జలాశయం కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అయిదు జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాల వర్షాధారిత భూములకు సాగు నీరందించే ఈ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పంపుహౌస్‌ సహా అన్ని పనులు పూర్తయ్యాయి.

పట్టుబట్టి కాళేశ్వర గంగను పైపైకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్‌ జలాశయంలోకి నీళ్లు విడుదల కానున్నాయి. కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చండీయాగం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొండపోచమ్మ ఆలయాన్ని సందర్శించారు.

  • ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చండీ, సుదర్శన యాగం, గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు. 29వ తేదీ ఉదయం 4 గంటలకు ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌజ్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం పూజలు జరగనున్నాయన్నారు.
  • ఉదయం 7.45 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
  • చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు.
  • అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఏం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ వద్ద గల కొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజ్ వద్దకు చేరుకుంటారు.
  • 10 గంటల సమయంలో పంపుహౌస్ వద్దకు చేరుకుని చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు.
  • అనంతరం పంపుహౌజ్ స్విచ్ ఆన్ చేసి (ప్రారంభం) చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు సీఎం స్వాగతం పలుకుతారు.
  • అతిథులకు అక్కడే మధాహ్నం భోజనం ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details