తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్​కు ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టే' - candidate

ప్రచారాలు ముగిసే సమయం దగ్గర పడుతుండగా నేతలు, కార్యకర్తలు జోరు పెంచారు. మాజీమంత్రి హరీశ్ రావు మెదక్​లో రోడ్ షో నిర్వహిస్తూ తెరాస అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

హరీశ్ రావు ప్రచారం

By

Published : Apr 9, 2019, 3:39 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ప్రచార తార హరీశ్ రావు రోడ్​షో నిర్వహించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేంద్రంలో తెరాస కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్​కు ఓటేస్తే మురుగు కాల్వలో వేసినట్టేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

హరీశ్ రావు ప్రచారం

ABOUT THE AUTHOR

...view details