Harish Rao Latest News : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థుల కోసం దరఖాస్తులు అమ్ముతోందని.. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నీ అమ్ముతుందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. హస్తం పార్టీకి తెలంగాణలో 35 నుంచి 40 స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని (Harish Rao Fires on Congress) విమర్శించారు. ఎన్నికలప్పుడు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. అక్కడి రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Harish Rao Comments on Congress and BJP :కాంగ్రెస్‌కు లీడర్లు లేరని.. బీజేపీకి క్యాడర్ లేదని హరీశ్‌రావు (Harish Rao Comments on Congress and BJP) విమర్శించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్కు తిరుగు లేదని అన్నారు. రాష్ట్రంలో కమలం పార్టీ పని అయిపోయిందని.. ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోవడం కోసమే ఆ పార్టీ ఆరాటమని అన్నారు. ఆ రెండు పార్టీలు రైతులు, మహిళలు, యువకుల దగ్గరికి వెళ్లి ఓట్లడిగే పరిస్థితి లేదని విమర్శించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని.. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని హరీశ్రావుధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు.. రూ.20,000 కోట్ల రుణమాఫీ చేసినట్టు హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే రూ.99,999లోపు రుణాలన్నీ మాఫీ అయ్యాయని చెప్పారు. త్వరలోనే రూ.లక్షకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని వెల్లడించారు. కొందరి అకౌంట్ పని చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అకౌంట్ ఆపరేషనలైజ్ చేసి మాఫీ చేస్తామని ఈ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని హరీశ్‌రావు చెప్పారు.