మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మడూరు గ్రామానికి చెందిన సర్పంచ్ నరసమ్మ మంత్రి హరీశ్ రావుకు తన బాధను వివరించింది. గతేడాది గ్రామంలో రూ.4లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ చెప్పారు. డబ్బు లేకపోతే అప్పు తెచ్చి రోడ్డేశానని తెలిపారు. అప్పు వడ్డే రూ.లక్ష అయిందన్నారు. డబ్బులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అప్పు చేసి రోడ్డేసిన.. ఇంకా పైసలు రాలే: మంత్రితో సర్పంచ్
ఊరి బాగు కోసం సొంత డబ్బు వెచ్చించి రోడ్డు నిర్మాణం చేపడితే నెలలు గడిచిన తన డబ్బులు రాలేదని ఓ సర్పంచ్ మంత్రి హరీశ్ రావుకు మోర పెట్టుకుంది. స్పందించిన మంత్రి వెంటనే రూ.లక్ష రూపాయలు అందించారు.
అప్పు చేసి రోడ్డెసిన.. ఇంకా పైసాలు రాలే: మంత్రితో సర్పంచ్
స్పందించిన మంత్రి హరీశ్ రావు తక్షణమే లక్ష రూపాయలు ఇవ్వడమే కాకుండా... మిగిలిన డబ్బులు త్వరగా అందేలా చూడాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. దీంతో సర్పంచ్ నరసమ్మ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:జ్ఞాపకశక్తి పెరుగుతుందని పిల్లలకు సెలైన్
Last Updated : Feb 14, 2021, 10:47 PM IST