సర్వమానవ సౌభ్రతృత్వాన్ని గురునానక్ చాటిచెప్పారని సామాజిక సమరసత వేదిక విభాగ్ కన్వీనర్ మత్స్యేంద్రనాథ్ అన్నారు. దైవత్వం అన్ని జీవుల్లో సమానమని ఆచరించి చూపి చరిత్రలో గురునానక్ నిలిచిపోయారని... ప్రేమ, భక్తిమార్గాన్ని చూపిన గురునానక్ బోధనలు ఆచరణీయమన్నారు. గురునానక్ జయంతి సందర్భంగా మెదక్‌లోని సుభాశ్ నగర్లో సిక్ సిక్లేగార్ సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గురునానక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
'గురునానక్ బోధనలు ఆచరణీయం' - మెదక్ జిల్లా వార్తలు
మెదక్ జిల్లాలోని సుభాశ్ నగర్లో గురునానక్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక విభాగ్ కన్వీనర్ మత్స్యేంద్రనాథ్ హాజరయ్యారు. గురునానక్ బోధనలు ఆచరణీయమని ఆయన అన్నారు.
'గురునానక్ బోధనలు ఆచరణీయం'
సామాజిక సమరసత వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యాంప్రసాద్ రాసిన గురునానక్ దేవ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిక్ సిక్లేగార్ సమాజ్ బాధ్యులు లఖన్ సింగ్, రాణా సింగ్, సూరజ్ సింగ్, హజార్ సింగ్, కిషన్ సింగ్, తారాసింగ్, గోపాల్ సింగ్, వేదిక జిల్లా అధ్యక్షులు రవి, పవన్ కుమార్, వెంకటేశ్వర్లు, అఖిల్, రాజు, సాయి బలరామ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రాణాలకు తెగించి.. వెలుగులు నింపాడు...