Ground water coming out of damaged motor bores: ఉమ్మడి మెదక్ జిల్లాలో పాతాళ గంగమ్మ ఉబికి వస్తోంది. గతంలో నీళ్లు లేక కాలిపోయిన మోటారు బోరు బావుల నుంచి భూగర్భ జలాలు పైకి పొంగుకోస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు పడుతూ ఉండటంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అనేక గ్రామాల్లో బోరుబావుల్లోంచి నీళ్లు పైకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో న్యాల్‌కల్, జహీరాబాద్, కోహిర్, ఝరాసంగం, మునిపల్లి మండలాల్లో భూగర్భ జలసిరి సంతరించుకోంది.
బోరు బావుల నుంచి ఉబికి వస్తున్న పాతాళగంగా.. అయోమయంలో రైతులు..!
Ground water coming out of damaged motor bores: గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది కురుస్తోన్న భారీ వర్షాలకు తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి అనడానికి ఇదోక్కటే ఉదాహరణ.. భూగర్భ జలాలు నిండడం వల్ల పాడైపోయిన మోటారు బోరు బావుల నుంచి జలసిరి దారాళంగా వస్తోంది. కానీ రైతులు మాత్రం ఆనంద పడాలో.. బాధ పడాలో తెలియక తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో మీరే చూడండి?
మెదక్ జిల్లాలో శివ్వంపేట, తూప్రాన్, నర్సాపూర్ మండలాల్లో బోరు బావుల్లోంచి నీళ్లు పైకి పొంగుతున్నాయి. నీరంతరాయంగా నీళ్లు వస్తుండటంతో.. రైతులు చేతికి వచ్చిన పంటను కోసుకోలేక పోతున్నారు. ఒకప్పుడు వందల అడుగులు బోర్లు తవ్వినా రాని నీళ్లు ఇప్పుడు వాటికి అవే పైకి వస్తున్నా.. సంతోష పడలేకపోతున్నాం అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు వచ్చిన పంటను కోయడానికి పొలాల్లోకి ఈ నీటి వల్ల ఎటువంటి కోత యంత్రాలు రావని రైతులు వాపోతున్నారు. నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి తలెత్తిందన్నారు.
ఇవీ చదవండి: