విద్యార్థులకు ఉపయోగపడే బోధనాభ్యాసన సామగ్రి తయారు చేయడంతో పాటు పాఠశాల గోడలను బొమ్మలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం తొగుట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ప్రేమ్ కుమార్. ఆయన సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో సమయం వృథా చేయకుండా అంతర్జాలంలో చూసి కార్టూన్ బొమ్మలు వేయడం నేర్చుకున్నారు. సొంత డబ్బులతో రంగులు కొనుగోలు చేసి తరగతి గదుల గోడలపై విద్యార్థులను ఆకట్టుకునేలా కార్టూన్లు వేశారు.
కాగితం ముక్కలతో
1 నుంచి 10 వరకు ఎక్కాలు, ఆంగ్ల వర్ణమాలను రంగులతో తీర్చిదిద్దారు. విద్యార్థులకు జ్ఞానం పెంపొందేలా కొన్ని రకాల పజిల్స్నూ గోడలపై చిత్రించారు. ఎండిన ఓ చెట్టు కొమ్మను తరగతి గదిలో ఏర్పాటు చేశారు. ఆ కొమ్మకు ఆంగ్ల అక్షరమాలతో పండ్లు, కూరగాయల పేర్లు తెలిపేలా.. రంగురంగుల కాగితం ముక్కలతో ఆకుల రూపంలో అందంగా అలంకరించారు.
నిజంగా పక్షులే ఉన్నాయా అనిపించేలా..