మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అందజేశారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని ఆమె అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపలేదన్నారు.
ఆదాయం తగ్గినా ప్రభుత్వ పథకాలు ఆపలేదు : పద్మా దేవేందర్‌రెడ్డి - మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి చెక్కల పంపిణీ
కరోనా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
ఆదాయం తగ్గినా ప్రభుత్వ పథకాలు ఆపలేదు : పద్మా దేవేందర్‌రెడ్డి
మండలకేంద్రంలోని 17 మందికి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నేరుగా లబ్ధిదారులకే నిధులు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.