మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ చూస్తే... అందరూ ఆగమవ్వాల్సిందే. ఎందుకు అంటారా..! అది చెరువో, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన పార్కో అనుకుంటారు. పొరపాటున అక్కడకి వెళ్లి సేద తీరాలనుకుంటే మాత్రం ప్రమాదమేనండోయ్. ఎందుకంటే... ఏపుగా పెరిగిన ఆ గడ్డిలో విషపురుగులు తిరుగుతున్నాయి. ఆస్పత్రి పక్కనే ఇంత అధ్వాన్నంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు... ఎప్పుడు ఎక్కడ నుంచి ఏం వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటిని, ఏపుగా పెరిగిన గడ్డిని తొలగించాలని కోరుతున్నారు.
అపరిశుభ్రమైన ఆవరణలో ప్రభుత్వాసుపత్రి - అపరిశుభ్రమైన ఆవరణలో రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ఆస్పత్రి ఆవరణ పక్కనే ఓ మురికి కాలువ. అది చాలదన్నట్లు దాని చుట్టూ ఏపుగా పెరిగిన గడ్డి. ఆ ప్రాంతం చూస్తే దోమలు, విషపు పురుగులకు నిలయమేమో అన్న అనుమానం రాక మానదు.
అపరిశుభ్రమైన ఆవరణలో ప్రభుత్వ ఆస్పత్రి
TAGGED:
unclean Government hospital