తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​ సీఎస్​ఐ చర్చిలో గుడ్​ ఫ్రైడే వేడుకలు - మెదక్ జిల్లా వార్తలు

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెదక్ సీఎస్​ఐ చర్చిలో గుడ్​ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. సంప్రదాయం పాటిస్తూ శిలువను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

good friday in medak csi church
గుడ్ ఫ్రైడే వేడుకలు

By

Published : Apr 2, 2021, 4:19 PM IST

మెదక్ సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మత గురువుల ప్రార్థనలు, భక్తి గీతాలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చర్చిలో సంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసు శిలువను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రార్థన మందిరంలో ప్రతిష్ఠించారు. ఈ ప్రార్థనలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి.

ఏసుక్రీస్తు శిలువ ఎక్కిన రోజు చెప్పిన 7 వాక్యాలను స్మరించుకోవడమే గుడ్ ఫ్రైడే ప్రెస్ బిటరీ ఇంఛార్జ్ ఆండ్రస్ ప్రేమ్ సుకుమార్ తెలిపారు. భక్తులు ఏసుప్రభు గీతాలతో అలరించారు. కొవిడ్ వల్ల భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కమిటీ సభ్యులు సూచించారు.

ఇదీ చూడండి:సునీల్‌ నాయక్‌ ఆత్మహత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యే: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details