మెదక్ జిల్లా తునికి రామానాయుడు పాంహౌస్ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. హనుమాన్ మాల విరమణ కోసం కొండగట్టుకు వెళ్తున్న స్వాముల కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లింది. ఈ ఘటనలో చంద్రకాంత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆలయానికి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం - మెదక్ జిల్లా తాజా వార్తలు
స్వాములు అందరూ కలసి మాల విరమణ కోసం కొండగట్టు హనుమాన్ ఆలయానికి వెళ్తున్న క్రమంలో ఘోరం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి కిందకు దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా తునికి రామానాయుడు పాంహౌస్ వద్ద చోటుచేసుకుంది.
ఆలయంకు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం
మరో ఇద్దరు వ్యక్తులు నితిన్, ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సాయి, రాఘవేందర్, రాజులకు స్వల్పగాయాలయ్యాయి. వారిని నర్సాపూర్ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :లాక్డౌన్ ఎఫెక్ట్: ట్యాంక్‌బండ్‌పై గుర్రపు సవారీ