ఎడతెరిపిలేకుండా మూడ్రోజులుగా కురుస్తున్న వానలకు మెదక్ జిల్లాలోని చెరువులు , వాగులు జలకళను సంతరించుకున్నాయి. వరద నీరుతో మంజీరా నిండటం వల్ల ఘనపూర్ ప్రాజెక్టుకు పెద్దమొత్తంలో నీరు వచ్చి చేరుతోంది. ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఏడుపాయల దుర్గాభవాని కోవెల వద్ద వరద ఉద్ధృతి - ghanapoor project is flooded with rain water in medak district
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలోని చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. మంజీరా నిండటం వల్ల ఘనపూర్ ప్రాజెక్టుకు పెద్దమొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఏడుపాయల దుర్గాభవాని కోవెల వద్ద వరద ఉద్ధృతం
ప్రతి ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లో సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేవారు.. సింగూరు అడుగంటడం వల్ల రెండేళ్ల నుంచి నీటి విడుదల లేదు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండటం వల్ల రైతులు రెండు పంటలు పండుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.