మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గంజాయి సరఫరా గుట్టుగా జరుగుతోంది. ఎవరికి అనుమానం రాకుండా గృహ సమూదాయాల మధ్యలోనే విక్రయిస్తున్నారు. గంజాయిని 10 గ్రాముల చొప్పున పాకెట్ల రూపంలో తయారుచేసి అమ్ముతున్నారు. మెదక్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంటెంట్ గాయత్రి అదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రజిత ఆధ్వర్యంలో నర్సాపూర్‌లోని 4-57/1 ఇంటిపై శుక్రవారం రాత్రి దాడి చేయగా... 10 గ్రాముల ప్యాకెట్లు 38 లభించాయి. మొత్తం 380 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని విక్రయిస్తున్న రియాజ్‌ఉస్మాన్, షేక్ఆరీఫ్లను అరెస్టు చేశారు.
నర్సాపూర్‌లో గుప్పుమంటున్న గంజాయి -
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఓ ఇంట్లో గంజాయి సరఫరా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. ఎక్సైజ్ అధికారులు చేసిన దాడిలో 380 గ్రాముల గంజాయి పాకెట్లు సీఐ రజిత స్వాధీనం చేసుకున్నారు.
![నర్సాపూర్‌లో గుప్పుమంటున్న గంజాయి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4508960-167-4508960-1569054887337.jpg)
నర్సాపూర్‌లో గుప్పుమంటున్న గంజాయి