సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా గాంధీజీ సంకల్ప యాత్రను భాజపా చేపట్టిందని ఇది చరిత్రాత్మకమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గాంధీజీ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను భాజపా కొనసాగిస్తుందని ఏక్ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 60 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేయలేని అనేక సాహసోపేత నిర్ణయాలను భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిందన్నారు. ఐదేళ్ల కాలంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నారని అన్నారు.
పటేల్ జయంతి సందర్భంగా గాంధీ సంకల్పయాత్ర - latest news of gandhi's sankalpa yatra
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్విహించిన గాంధీ సంకల్పయాత్రలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందన్ పాల్గొన్నారు.
పటేల్ జయంతి సందర్భంగా గాంధీ సంకల్పయాత్ర