సిద్దిపేటలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు చేపట్టిన గాంధీ సంకల్పయాత్ర నేడు మెదక్ పట్టణానికి చేరుకుంది. ఈ సంకల్ప యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. అవుసుల పల్లి నుంచి రామదాసు చౌరస్తా వరకు పాదయాత్ర చేశారు. అనంతరం రాందాస్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు క్రియాశీల పాత్ర పోషించారని తెలిపిన లక్ష్మణ్.. 50 వేల మంది కార్మికులను ముఖ్యమంత్రి రోడ్డున పడేయడం అమానుషమన్నారు. హుజూర్‌నగర్‌లో తెరాస గెలవగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శశిధర్ రెడ్డి, నందీశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్ - bjp laxman
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని ఈ సందర్భంగా ఆరోపించారు.
గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న లక్ష్మణ్
TAGGED:
bjp laxman