సన్నరకం వరి సాగు చేయమని చెప్పిన కేసీఆర్.. ఇప్పడు సన్నరకానికి మద్దతు ధర ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మండిపడ్డారు. సన్నరకం వేసి దోమపోటు, కాటుక రోగం వచ్చి రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
'పీఆర్సీ, ఐఆర్ ఇవ్వలేని పరిస్థితిలో తెరాస ప్రభుత్వం ఉంది' - medak bjp office latest news
సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మండిపడ్డారు. ఉద్యోగులకు ఇప్పటి వరకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వలేని పరిస్థితిలో తెరాస ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ మేరకు మెదక్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు.
'పీఆర్సీ, ఐఆర్ ఇవ్వలేని పరిస్థితిలో తెరాస ప్రభుత్వం ఉంది'
ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత ఉద్యోగులకు ఇప్పటి వరకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వలేని పరిస్థితిలో తెరాస ప్రభుత్వం ఉందని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు ఎంఈఓలను నియమించలేదని.. సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇక్కడే కనబడుతోందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్లల విజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలీసు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశం