మంజీరా నదిలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు - మంజీరా నదిలో చిక్కుకున్న మత్స్యకారులు
09:45 October 21
మంజీరా నదిలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులు
మెదక్ జిల్లా కొల్చరం మండలం హనుమాన్ బండల్ వద్ద చేపల వేటకు వెళ్లి మంజీరా నది వరదలో నలుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుంపల ఎల్లం, సాదుల యాదగిరి, మెదక్ పట్టణానికి చెందిన స్కైలాబ్, నాగరాజులుగా గుర్తించారు. వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
మంగళవారం రాత్రి వరద ఉద్ధృతి తక్కువ ఉండటంతో చేపలు పట్టడానికి వెళ్లారు. సింగూర్ నుంచి నీటిని వదలడంతో మంజీరా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఘటనా స్థలానికి నర్సాపూర్ ఇంఛార్జీ ఆర్డీవో సాయిరాం, రెవెన్యూ అధికారులు వెళ్లారు.
ఇదీ చదవండి :నేడూ, రేపూ భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక