తెరాస ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మాజీమంత్రి, భాజపా నేత, సినీ నటుడు బాబుమోహాన్ మండిపడ్డారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వెకిలి మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తానని, కార్యకర్తలకు పదవులు ఇప్పిస్తానని లంచాలు తీసుకున్న క్రాంతికిరణ్‌కు తనను విమర్శించే అర్హత లేదన్నారు.
దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎవరేంటో తెలుస్తది: బాబుమోహన్ - భాజపా నేత బాబు మోహన్ తాజా వార్తలు
ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై మాజీ మంత్రి, భాజపా నేత బాబుమోహన్ విమర్శలు గుప్పించారు. లంచాలు తీసుకునే ఎమ్మెల్యేకు తనను విమర్శించే హక్కు లేదని ధ్వజమెత్తారు.

దమ్ముంటే రాజీనామా చేయ్... ఎవరెంటో తెలుస్తది: బాబుమోహన్
దమ్ముంటే రాజీనామా చేసి పోటీచేస్తే నీతిపరుడు, అవినీతి పరుడు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. తెరాస ఎమ్మెల్యేలు మాట్లాడే భాష మనుషులు మాట్లాడేది కాదని ఎద్దేవా చేశారు. వాళ్లు భూములు కబ్జాలు చేసినా... మిన్నకుండిపోవాలా అని ప్రశ్నించారు.