తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫామ్​హౌస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి' - మాజీ మంత్రి బాబు మోహన్ వార్తలు

అందరూ కలిసికట్టుగా రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేయాలని... మాజీ మంత్రి బాబుమోహన్ సూచించారు. ఫామ్​హౌస్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని.. వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

former-minister-babu-mohan-on-trs-party-in-medak
'ఫామ్​హౌస్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి'

By

Published : Jun 8, 2020, 7:57 PM IST

స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై గ్రామగ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు భాజపా సంయుక్త కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్​లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను గడపగడపకు తీసుకెళ్లే విధంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

స్వదేశీ ఉత్పత్తులను వాడాలని విదేశీ వస్తువులను బహిష్కరించాలనే నినాదంతో మోదీ ముందుకు సాగుతున్నారని... మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఫామ్​హౌస్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని... వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:గూగుల్​​లో కరోనాకు తగ్గిన డిమాండ్- వినోదానికే జై

ABOUT THE AUTHOR

...view details