అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎఫ్‌వో ఙ్ఞానేశ్వర్ హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామపంచాయతీ పరిధిలో గల 308 కంపార్టుమెంట్లలో గతంలో కొంతభూమి ఆక్రమణకు గురైంది. అధికారులు ఇప్పటికే చాలాసార్లు సర్వే చేశారు. తాజాగా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు.
'అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు'
అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అటవీ అధికారులు హెచ్చరించారు. మెదక్ జిల్లా చిప్పల్‌తుర్తి గ్రామపంచాయతీ పరిధిలో కొంత భూమి ఆక్రమణకు గురైంది. దానిపై అధికారులు సర్వే చేపట్టారు. త్వరలో పూర్తి నివేదిక ఇస్తామని వెల్లడించారు.
'అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు'
గతంలో ఏర్పాటు చేసిన హద్దురాళ్లను పరిశీలించారు. ఈ సర్వే జిల్లా రెవెన్యూ సర్వే అధికారి గంగయ్య ఆధ్వర్యంలో జరిగింది. మరోసారి పూర్తి సర్వే చేసి నివేదిక ఇస్తామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో అంబర్‌సింగ్, సెక్షన్ అధికారి బాలేషం తదితరులు పాల్గొన్నారు.