సిర్పూర్ కాగజ్‌నగర్ సారసాలలో అటవీ అధికారులపై జరిగిన దాడికి నిరసనగా మెదక్‌లో అటవీశాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. డివిజన్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసిన అధికారులు... అనంతరం జాయింట్ కలెక్టర్ నగేష్‌కు వినతి పత్రం అందజేశారు. విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారిణిపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగిన జడ్పీ వైస్ ఛైర్మన్, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు. ఇటువంటి దౌర్జన్యపూరిత చర్యలతో అధికారుల మనోధైర్యం దెబ్బతిని విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దాడికి నిరసనగా అటవీ శాఖ సిబ్బంది ర్యాలీ - దాడికి నిరసనగా అటవీ సిబ్బంది ర్యాలీ
సారసాల గ్రామంలో అటవీ అధికారులపై జరిగిన దాడికి రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ... మెదక్‌లో అటవీ శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు.

FOREST OFFICERS CONDUCTED RALLY AGAINST ATTACK