అటవీశాఖలో ఉద్యోగమంటే ఆషామాషీ కాదు. ప్రమాదాలు జరిగిన వెంటనే తేరుకుని స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీశాఖ పరిధిలోని శివ్వంపేటలో తేజస్విని బీట్ అధికారిగా పనిచేస్తున్నారు. అడవులను కాపాడాలంటూ... ఆమె రెండు నిమిషాల నిడివిగల ఓ లఘుచిత్రాన్ని రూపొందించారు.
'అడవుల నరికివేత వల్లే కరోనా వైరస్' - Forest_Beat officer about corona virus
అడవుల నరికివేత వల్లే కరోనా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయంటూ.. మెదక్జిల్లా నర్సాపూర్ అటవీ శాఖ పరిధిలో పనిచేస్తున్న అటవీ అధికారి లఘు చిత్రాన్ని రూపొందించారు. చెట్లను నరికివేయడం వల్లే గబ్బిలాలు వంటి జీవులు జనారణ్యంలోకి వచ్చి... వైరస్‌లకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
!['అడవుల నరికివేత వల్లే కరోనా వైరస్' Forest_Beat officer_Small_Video](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7325706-thumbnail-3x2-forest.jpg)
'అడవుల నరికివేత వల్లే కరోనా వైరస్'
'అడవుల నరికివేత వల్లే కరోనా వైరస్'
అడవుల నరికివేత వల్లే కరోనా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయంటూ ఆ చిత్రంతో తెలియజేశారు. అడవులను నరికేయడం వల్ల వర్షాలు సరిగ్గా కురవట్లేదు. వన్యప్రాణులు ఆవాసాలు కోల్పోయి... ప్రజల మధ్యలోకి వచ్చి... వైరస్‌లకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. లఘుచిత్రాన్ని చూసిన అధికారులు అందరు అభినందించారు.
ఇదీ చదవండిఃపెన్గంగ నది మధ్యలో యథేచ్ఛగా ఇసుక దందా