విద్యార్థి ఆత్మహత్యాయత్నం
విద్యార్థి కాలర్ పట్టుకుని చెంపపై కొట్టి...
విద్యార్థులందరూ ప్రశాంతంగా పరీక్ష రాస్తున్నారు. ఒక విద్యార్థి కాపీ కొడుతున్నట్లు భావించిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఏం చేయాలి? డిబార్ అయినా చేయాలి లేదా అతడిని పరీక్ష రాయకుండా పంపిచేయాలి. ఈ అధికారిణి మాత్రం విద్యార్థిని కొట్టి తన కోపాన్ని ప్రదర్శించారు.
మనస్తాపంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. ప్రైవేట్ పాఠశాల పరీక్షా కేంద్రాలకు వెళ్లకుండా ఇక్కడికే వస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
కాపీ చేస్తే డిబార్ చేయాలని... కొట్టడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని కొట్టిన విషయం తమదృష్టికి రాలేదని ఎస్సై తెలిపారు. ఫిర్యాదు వస్తే విచారణ చేపడుతామని చెప్పారు.
ఇవీ చూడండి:కేసీఆర్ దేశానికి దిక్సూచి