మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ చెరువు మత్తడి పోస్తోంది. నాలుగేళ్ల తర్వాత నిండుకుండలా మారిన చెరువును చూసి స్థానికులు సంబరపడుతున్నారు. ఈ ఏడు వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి ఆశాజనకంగా వానలు కురవడం వల్ల చెరువులోకి భారీగా నీరు చేరింది.
నాలుగేళ్ల తర్వాత మత్తడి పోస్తున్న జలాల్పూర్ చెరువు - flood overflow in medak district
నాలుగేళ్ల తర్వాత మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ చెరువు మత్తడి పోస్తోంది. 2016 తర్వాత మళ్లీ ఇప్పుడు జలకళను సంతరించుకున్న జలాల్పూర్ చెరువును చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జలాల్పూర్ చెరువు
రెండేళ్ల వరకు ఇక తమకు కరవు ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మత్తడి వద్దకు తరలివస్తున్న పిల్లలు, పెద్దలు నీటిలో కేరింతలు కొడుతూ ఆడుతున్నారు.