తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు: హరీశ్

మెదక్​ జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశానికి ఆర్థికమంత్రి హరీశ్​ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేంది లేదని హెచ్చరించారు. మార్కెట్​లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసేలా రైతులను చైతన్య పరచాలని అధికారులకు సూచించారు.

finance minister harish rao attend to medak zilla parishad general body meeting
రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు: హరీశ్

By

Published : Jun 9, 2020, 5:55 PM IST

రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​ రావు అన్నారు. నకిలీ విత్తనాలు తయారీ కంపెనీలు, సరఫరాదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మెదక్​ జడ్పీ ఛైర్​పర్సన్​ ర్యాకల హైమలత అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్తీ విత్తనాలను మార్కెట్‌లోకి అడ్డదారిన సరఫరా చేసే, నిల్వచేసే వారిని, గుర్తించి, విక్రయించే వ్యాపారులను, ఏజెంట్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అన్ని మండలాల వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామాల వారీగా రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలతో ఏఈవోలు గ్రీన్ బుక్​ తయారు చేసుకోవాలన్నారు.

మార్కెట్​లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసేలా రైతులను చైతన్యపరచాలని మంత్రి అన్నారు. రైతుబంధు వేదిక నిర్మాణాల్లో మెదక్​ జిల్లాలను రాష్ట్రంలో మొదటి స్థానంలో సూచించారు. జిల్లాలో రుణమాఫీకి అర్హులైన రైతులు 26 వేల మంది అన్నట్టు తెలిపారు. రూ.25 వేల లోపు అప్పు ఉన్న 12 వేల మంది రైతులకు రుణమాఫీ వచ్చిందని, మిగిలిన 14 వేల మంది రైతుల రుణమాఫీ కోసం వారి బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డు నెంబర్​ అప్​డేట్ ప్రాసెస్​ వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

జిల్లాకు పండ్లు, కూరగాయలు ఎక్కడెక్కడి నుంచి, ఎంతమేర దిగుమతి అవుతున్నాయో లెక్కలు తీయాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రాంత పరిసరాల్లో పండ్లు, కూరగాయల సాగుకు అనువైన నేలలు గుర్తించి, రైతులను ప్రోత్సహించాలన్నారు. గొర్రెలు, చేపలు, కోళ్ళ పరిశ్రమకు అవసరమైన షెడ్లు ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేయిస్తామన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, మెదక్​, నర్సాపూర్​, దుబ్బాక ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్​రెడ్డి, మదన్​రెడ్డి, రామలింగారెడ్డి, కలెక్టర్​ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:చమురుబావిలో మంటలు.. 13రోజులుగా విషవాయువు లీక్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details