తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం' - మెదక్ జిల్లాలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా నర్సాపూర్​లో గురువులను సన్మానించారు. వారు అంకితభావంతో పనిచేసి... విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్​ సూచించారు.

felicitation ceremony to teachers at narsapur in medak district
'సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం'

By

Published : Oct 6, 2020, 12:54 PM IST

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళి యాదవ్‌ అన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో నర్సాపూర్‌ ఎంఈవో బుచ్చానాయక్‌, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాడు వేణుమాధవ శర్మ‌, శ్రీనివాస్‌లను సన్మానించారు.

ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి... విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్​ కార్యదర్శి మధుశ్రీ శర్మ, మోహన్‌ రెడ్డి, హరికృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:తనది కాని సొమ్ము తనకొద్దనుకున్నాడు.. పోలీసులకు అప్పగించాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details