తెలంగాణ

telangana

ETV Bharat / state

వానరాలకు, పక్షులకు ఆహారం అందించిన బంజారా మిషన్ - జాతీయ బంజారా మిషన్

లాక్‌డౌన్ క్లిష్ట కాలంలో వన్య ప్రాణుల పట్ల దయాగుణాన్ని చాటుకున్నాడో వన్యప్రాణి ప్రేమికుడు. అడవిలో ఆకలితో అలమటిస్తున్న వానరాలకు, పక్షులకు ఆహారాన్ని అందించాడు.

వానరాలకు పండ్లు అందించిన బంజారా మిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
వానరాలకు పండ్లు అందించిన బంజారా మిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

By

Published : May 1, 2020, 11:53 PM IST

నర్సాపూర్ అటవీ ప్రాంతాల్లో ఉన్న కోతులు, పక్షుల కోసం జాతీయ బంజారా మిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ నాయక్‌ 150 కిలోల అరటి పండ్లు, 30 కిలోల పులి హోరా, 100 లీటర్ల నీటిని అడవిలో ఉంచారు. లాక్‌డౌన్‌తో పాటు ఎండాకాలంలో వన్యప్రాణులు ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నాయనే అవి సమకూర్చినట్లు కృష్ణ నాయక్ తెలిపారు. వన్యప్రాణులకు ఆహారం అందించిన వారిలో రాములు నాయక్‌, తారా సింగ్ నాయక్, మేడ్చల్‌ జిల్లా సభ్యులు బాల్​ రాజ్‌ నాయక్‌, గణేష్ నాయక్ తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details