తెలంగాణ

telangana

ETV Bharat / state

సహకార సంఘం వద్దకు యూరియా.. బారులు తీరిన రైతులు - farmers waiting for urea at narsapu

గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా రైతులు వరి నాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్​ జిల్లా నర్సాపూర్​లో సహకార సంఘం వద్దకు 20 టన్నుల యూరియా రాగా.. వాటి కోసం రైతులు బారులు తీరారు.

urea at narsapur in medak district
సహకార సంఘం వద్దకు యూరియా.. బారులు తీరిన రైతులు

By

Published : Aug 18, 2020, 1:10 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణంలో రైతులు యూరియా కోసం బారులు తీరారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు వరి నాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని రైతులు యూరియా కోసం నర్సాపూర్​ చేరుకున్నారు.

మండల కేంద్రంలోని సహకారం సంఘం వద్ద యూరియా రాగా అన్నదాతలు అక్కడికి వరుసలు కట్టారు. మంగళవారం 20 టన్నులు వచ్చిందని.. బుధవారం మరొక 20 టన్నులు వస్తుందని మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. యూరియా కొరత లేదని.. రైతులెవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

ఇదీచూడండి: శాంతించిన గోదారి... 55.3 అడుగులకు చేరిన నీటిమట్టం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details