మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన(Farmers Protest)కు దిగారు. నాలుగు రోజులుగా పంట కొనడం లేదని.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్‌కు తరలించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు యజమానులు స్థానికేతరుల వడ్లు తీసుకుంటూ స్థానికుల వడ్లు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు.
Farmers Protest: ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల రాస్తారోకో - తెలంగాణ వార్తలు
ధాన్యం కొనుగోలు చేయడం లేదని మెదక్ జిల్లాలో రైతులు రాస్తారోకో(Farmers Protest)కు దిగారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో పంట కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
Farmers Protest: ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల రాస్తారోకో
ప్రగతి ధర్మారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన మొత్తం ధాన్యంలో 25% వడ్లు కూడా రైస్ మిల్లులకు తరలించలేదన్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా లారీలు పంపడం లేదని వాపోయారు. రైతుల గోడు పట్టించుకునే వారే లేరా అంటూ ధర్మారం రామాయంపేట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రామాయంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు.
ఇదీ చదవండి:మోదీని వెయిట్ చేయించిన మమత!