భూ సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి అధికారులు విఫలమయ్యారు అనడానికి మెదక్ జిల్లా నత్నయపల్లి గ్రామానికి చెందిన 20 మంది రైతులే నిదర్శనం. జిల్లాల వికేంద్రీకరణ అనంతరం వేరే జిల్లా పరిధిలోకి వెళ్లిన తమ భూముల మార్పిడి కోసం ఆర్డీవో కార్యలయం చూట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. భూమలకు సంబంధించి పట్టా మార్పిడి, తప్పులు సరి చేయడం, రికార్డులు ఎక్కించడం పలు సమస్యల పరిష్కారానికై అధికారులు డబ్బులు వసూలు చేసినట్లు బాధిత రైతులు పేర్కొంటున్నారు. అయినా పని చేయడం లేదని వాపోతున్నారు.
ఈనాడు కథనంపై స్పందించి
పట్టా భూములను ఆన్లైన్ చేసి.. కొత్త పాసు పుస్తకాలు అందించేందుకు వీఆర్వో నర్సింహులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు బాధిత రైతులు ఆర్డీవో వద్ద మొరపెట్టుకున్నారు. ఎట్టకేలకు ఈనాడు లో వచ్చిన కథనానికి స్పందించి.. సెలవు రోజైన ఆదివారం నాడే సగం సమస్యలను పరిష్కరించారని.. అనంతరం వీఆర్వోపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారని రైతులు తెలిపారు.
సమస్యలను మా దృష్టికి తీసుకురండి
మెదక్ జిల్లా నత్నయపల్లి గ్రామానికి చెందిన రైతుల సమస్య.. ఈనాడు పత్రికలో ప్రచురితం కావడం వల్ల తమ దృష్టికి వచ్చిందని.. ఆపై వెంటనే సమస్య పరిష్కారించాలని సంబంధిత ఎమ్మార్వోకి సూచించినట్లు సంగారెడ్డి ఆర్డీవో శీను తెలిపారు. బాధితుల నుంచి వాంగ్మూలం నమోదు చేశామని.. దానిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా డివిజన్ పరిధిలో 90శాతానికి పైగా సమస్యలు పరిష్కరించామని.. మిగిలిన వాటిని రానున్న 10- 15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని కోరారు. నత్నయపల్లి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ సమస్యలపై ఈటీవీ- ఈనాడు కథనానికి స్పందించిన ఆర్డీవో మూడు రోజుల తర్వాత వీఆర్వో నర్సింహులుపై సస్పెన్షన్ వేటు వేశారు.
భూ పట్టాల కోసం తిరిగి.. మా ప్రాణాలు అవిసిపోతున్నాయి ఇదీ చూడండి: అసలు ఆ స్థలం ఎవరిదో తెలిసేదెలా?