తెలంగాణ

telangana

ETV Bharat / state

నీళ్లు అడిగితే రైతులను నిర్బంధించారు.. - మెదక్ జిల్లా వార్తలు

నిరుడు కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నిండాయి. బావులు, బోర్లలో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. వాటిని చూసి మెట్ట ప్రాంత రైతులు ఎంతో సంతోషించారు. యాసంగికి నీటి కష్టాలు తీరినట్లేనని భావించారు. వానాకాలంలో వచ్చిన పంటనష్టాన్ని యాసంగిలో పూడ్చుకోవచ్చని అనుకున్నారు. తీరా వారి ఆశలు అడియాశలు అయ్యాయి. రెండు పంటలు కాదు కదా ఒక పంట కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. అనూహ్యంగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎక్కడికక్కడ ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Farmers detained for asking for water in medak district
నీళ్లు అడిగితే రైతులను నిర్బంధించారు..

By

Published : Apr 5, 2021, 11:34 AM IST

ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట ఎండిపోతుందని చెరువులో ఉన్న నీళ్లను వదలాలని అడిగిన రైతులను గ్రామపంచాయతీలో నిర్బంధించిన ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శలిపేటలో చోటు చేసుకుంది. వేసవి సమీపించడంతో భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. ఈ క్రమంలో నల్లచెరువు నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు కోరగా... తహసీల్దార్ స్పందించారని వెల్లడించారు.

గ్రామ వీఆర్వోని పంపించారని... కానీ సర్పంచ్ పోచయ్య కలగజేసుకుని గ్రామసభ పెట్టుకున్న తర్వాత నీరు వదులుతామన్నారని తెలిపారు. ఇప్పటికీ సభ పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పంటలు ఎండిపోతుండడంతో నీరు వదిలేందుకు కట్టకు వెళ్లగా... సర్పంచ్, అతని కుమారులు అసభ్యంగా మాట్లాడి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సైకి సమాచారం అందించామని... పోలీసులు వచ్చి విడిపించారని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:ఉపాధి కూలీల వినియోగానికి ఆ శాఖల విముఖత

ABOUT THE AUTHOR

...view details