మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి ఎర్రగుంట్ల తండాలో విషాదం చోటుచేసుకుంది. ఎండిపోతున్న నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లిన నాయక్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూడగా... అప్పటికే చనిపోయాడు. మృతునికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి రోదనలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - farmer died in medak
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి