రాష్ట్రంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని మాజీ ఎమ్మెల్సీ, గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు నాయక్ ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసుస్టేషన్లో గిరిజనులపై అటవీశాఖ అదికారులు ఫిర్యాదు చేసిన వివరాలను, సంబంధించిన పత్రాలను తీసుకున్నారు.
'గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని లాక్కోవాలని చూస్తున్నారు' - dharmathanda news
గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. భయబ్రాంతులకు గురిచేసి పంటలను ధ్వంసం చేశారన్నారు. పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ex mlc ramulu nayak on tribal lands
ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు అడవుల్లో సాగు చేసే గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రాములు నాయక్ తెలిపారు. నర్సాపూర్ ధర్మాతండాలో ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములను ఇప్పుడు వారివి కాదంటున్నారని వివరించారు. ధ్వంసం చేసిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.